- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎన్టీఆర్30’ ఓపెనింగ్ కు ట్రెడిషనల్ స్టన్నింగ్ లుక్ తో జాన్వీ కపూర్
దిశ, వెబ్ డెస్క్: ‘ఎన్టీఆర్30’ ఓపెనింగ్ కు జాన్వీ కపూర్ సంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. గ్రీన్ శారీలో కార్యక్రమంలో సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో తాజాగా పంచుకుంది. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురిగా తెలుగు ప్రేక్షకులకు కూడా జాన్వీ కపూర్ చాలా దగ్గరైంది. ఇప్పటికే బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో తనదైన ముద్ర వేసుకుంది. ఇక సౌత్ ఆడియెన్స్ ను కూడా అలరించబోతోంది. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ‘ఎన్టీఆర్30’తో బిగ్ ట్రీట్ అందింది. ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఏకంగా తారక్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈరోజే NTR30 పూజా కార్యక్రమంతో ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్, కొరటాల శివ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి జాన్వీ కపూర్ సైతం హాజరై అందరినీ ఆకట్టుకుంది. ఈ పాన్ ఇండియా సినిమాతో తెలుగు వారిని పలకరించబోతుండటంతో ప్రారంబోత్సవానికి సంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. గ్రీన్ కలర్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Nayanthara : బికినీ సీన్స్ అయితే చేయనంటూ.. డైరెక్టర్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్