ఆర్‌ఆర్‌ఆర్‌కు జగన్ ప్రశంస.. అద్నాన్ సమీ స్ట్రాంగ్ కౌంటర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-12 07:55:40.0  )
ఆర్‌ఆర్‌ఆర్‌కు జగన్ ప్రశంస.. అద్నాన్ సమీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా సినిమా టీంకు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్‌లో విషెస్ చెప్పారు. తెలుగు జెండా ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. ఏపీ ప్రజల తరపున ఎంఎం కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మీరు సాధించిన ఘనతతో మేమంతా గర్వంగా ఫీలవుతున్నామని ట్వీట్ లో రాసుకొచ్చారు. అయితే ఇదే అంశంపై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.

తెలుగు ఫ్లాగ్? మీ అర్థం ఇండియా ఫ్లాగ్ అనా? మనమంతా మొదట ఇండియన్స్.. ఇలా మీ నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని విభజించవద్దని కోరారు. 1947లో అనారోగ్యకర విభజించే అంశం మనం చూశామన్నారు. అద్నాన్ సమీ చేసిన ట్వీట్‌పై అభిమానులు మండి పడుతున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వచ్చిన అవార్డును బాలీవుడ్ హీరోలు సైతం ప్రశంసిస్తుంటే మీకేమయిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story