బయటపడ్డ జబర్దస్త్ నరేశ్ డేట్ ఆఫ్ బర్త్.. అమ్మో అంత పెద్దోడా..?

by sudharani |   ( Updated:2023-06-27 15:19:07.0  )
బయటపడ్డ జబర్దస్త్ నరేశ్ డేట్ ఆఫ్ బర్త్.. అమ్మో అంత పెద్దోడా..?
X

దిశ,వెబ్‌డెస్క్: పిట్ట కొంచెం కూత గణం అంటారు పెద్దలు. సామెతకు తగ్గట్లుగానే ఉంటాడు ఈ నరేశ్. కనిపించేందుకు చిన్నగా ఉన్నా.. అతడు వేసే పంచులకు పొట్ట చెక్కలు అయ్యేల నవ్వాల్సిందే. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు.. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ఎంతో మంది అభిమానుల్ని దక్కించుకున్నాడు. అయితే మూడు అడుగులే ఉన్న నరేష్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అసలు తన వయసు ఎంత..? అనే విషయాలపై ఇప్పటికే చాలా మంది ఆరా తీసే ఉంటారు. మరి నరేష్ వయసు ఎంతో తెలుసుకుందాం..

జనగాం జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో అవహేళనలకు గురయ్యాడు. కానీ, ఈ రోజు ఆ హైటే అతడిని బుల్లితెర కమెడీయన్‌ని చేసింది. అంతలా లక్ కలిసి వచ్చింది నరేశ్‌కు. కాగా.. నరేశ్ 1999 సంవత్సరంలో పుట్టాడట. అంటే ప్రస్తుతం తన వయసు 24 ఏళ్లు. ఈ విషయాన్ని ఓ షోలో తానే స్వయంగా బయటపెట్టాడు. చూడటానికి 10 ఏళ్ల కుర్రాడిలా ఉండే నరేశ్‌కు 24 ఏళ్లు అంటే ఎవరు నమ్మరు కానీ ఇది నిజం

Also Read..

అమ్మడూ...రష్మి...ఏమిటీ అందాల రచ్చ

Advertisement

Next Story

Most Viewed