- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena Kapoor: అది నా రక్తంలోనే ఉంది.. జీవితాంతం ఇక్కడే ఉండాలనుకుంటున్నా: కరీనా కపూర్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు రెఫ్యూజీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి అనతి కాలంలో తన అందం, అభినయం, నటనతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలందరిలో ఎన్నో మూవీస్ చేసి పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కరీనా కపూర్ అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2012లో స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత అందరిలాగే సినిమాకు దూరం అవుతుందని అంతా భావించారు. కానీ గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రజెంట్ కరీనా ది బకింగ్‌హామ్ మర్డర్స్, సింగం ఎగైన్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీలో పుట్టా. కాబట్టి సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు వింటూ పెరిగాను. దీంతో నాకూడా ఇండస్ట్రీపై చాలా ఇష్టం పెరిగింది. దీంతో నటిని కావాలని వెండితెరపై నన్ను చూసుకోవాలని కలలు కన్నాను. నా ఇష్టాన్ని నా ఫ్యామిలీ కూడా ఒప్పుకోవడంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. యాక్టింగ్ నా రక్తంలోనే ఉంది. నటనకు మించి నాకు ఏమీ తెలియదు. జీవితాంతం ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే కరీనా నటిస్తున్న ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ అక్టోబర్ 13న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
- Tags
- Kareena kapoor