Allu Arjun : స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేకపోవడానికి కారణం అదేనట?

by Hamsa |   ( Updated:2023-06-06 06:16:04.0  )
Allu Arjun : స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేకపోవడానికి కారణం అదేనట?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్నేహరెడ్డికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం బన్నీ పుష్పా-2 సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉండగా.. స్నేహ పిల్లలతో గడుపుతోంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్, స్నేహరెడ్డిల పెళ్లి గురించి తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. స్నేహరెడ్డిని కోడలిగా చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేదని.. స్నేహ కంటే ముందే బన్నీకి తన అమ్మ బంధువుల్లో ఓ అమ్మాయిని పెళ్లి చేయాలనుకుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కొడుకు మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు చెప్పాలనుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి అమెను తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడట. దీంతో చేసేదేమి లేక కొడుకు ఆనందం కోసం స్నేహరెడ్డిని కోడలిగా ఒప్పుకుందట. ఆ తర్వాత ఆమె మంచితనం చూసి, స్వభావం తెలిసి కోడలిగా ఒప్పుకుందట.

Read more: Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ

Hyper Aadi: మేము వేసే పంచులు వల్లే.. సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడంటున్న హైపర్ ఆది

Advertisement

Next Story