అక్కినేని అమల బంగారు నగలకు దూరంగా ఉండటం వెనుక రహస్యం ఇదే!

by samatah |   ( Updated:2023-03-27 14:44:43.0  )
అక్కినేని అమల బంగారు నగలకు దూరంగా ఉండటం వెనుక రహస్యం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని అమలకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నాగార్జునను ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం నటి కుటుంబాన్ని చూసుకుంటూ, అక్కినేని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వస్తుంది. కాగా, ఈమె సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే అమలకు కొన్ని కోట్ల ఆస్తి ఉన్న విషయం తెలిసిందే, ఆయినా ఆమె మాత్రం సింపుల్‌గా ఒక నల్లపూస దండతో మాత్రమే కనిపిస్తుంది, అయితే అమలకు అదోరకమైన స్కిన్ ఎలర్జీ, ఆరోగ్య సమస్య ఉంది. అందుకే ఆమె బంగారం నగలు ధరించదు అంటున్నారు కొందరు. అంతే కాకుండా ఆమె బంగారు నగలు ధరిస్తే మెడపై, చేతులపై రాషెస్ ఏర్పడి చర్మం మొత్తం ఎర్రబడిపోయి ఘోరంగా కనిపిస్తుందంట. అందు వల్లనే పాపం అమల బంగారు నగలకు దూరంగా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు.

Also Read...

సమంత డ్రెస్సింగ్‌పై చర్చ.. ఎందుకలా చేస్తోందంటూ

Advertisement

Next Story