అందరినీ పక్కన పెట్టి.. ఆ ఒక్క హీరోను మాత్రమే ఫాలో అవుతున్న ఇన్‌స్టా !

by Prasanna |   ( Updated:2023-12-24 14:38:37.0  )
అందరినీ పక్కన పెట్టి.. ఆ ఒక్క హీరోను మాత్రమే ఫాలో అవుతున్న ఇన్‌స్టా !
X

దిశ, సినిమా: సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్. ప్రజెంట్ ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ అంటూ ఉండదంటే నమ్మడం కష్టం. కామన్‌మెన్ నుంచి సెలబ్రిటీ వరకు ఈ యాప్ ను వాడేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల కెరీర్‌ కూడా సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టి మలుపులు తిరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే అదొక స్టేటస్‌గా భావిస్తారు. ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇన్‌స్టాను వాడటంతోపాటు మనీ, పాపులారిటీ రెండూ సంపాదిస్తున్నారు.

అయితే ఇండియాలో ఇప్పటివరకు ఇన్‌స్టాలో నెంబర్ వన్‌గా ఉన్న స్టార్ ఎవరంటే? ప్రియాంక చోప్రా పేరే వినిపిస్తుంది. ఈమెకు ఇండియాతోపాటు ఇండియా బయట కూడా కలిపి ఇప్పటి వరకైతే మొత్తం 89.7 మిలియన్ల (8.97 కోట్లు) మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్ తర్వాత అలియా భట్ 80.2 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లతో టాప్ త్రీ ప్లేస్‌లో కొనసాగుతుండగా, దీపికా పదుకొనేకు 76.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇలాంటి వారందరినీ పక్కన పెట్టి ఆ ఒక్క హీరోని మాత్రమే ఫాలో అవుతోంది ఇన్‌స్టా. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇండియా మొత్తంలో బాలీవుడ్‌ యువ హీరో విక్కీ కౌశల్‌ను మాత్రమే ఇన్‌స్టా ఫాలో అవుతున్నది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది.


Read More..

అలియా భట్ కూతురి ఫొటో లీక్.. ఎంత క్యూట్‌గా ఉందో?

Advertisement

Next Story

Most Viewed