Indra Movie: వైరల్ అవుతున్న ఇంద్ర మేకింగ్ వీడియో.. అందులో హైలెట్ గా నిలిచిన రామ్ చరణ్

by Prasanna |
Indra Movie: వైరల్ అవుతున్న ఇంద్ర మేకింగ్ వీడియో.. అందులో హైలెట్ గా నిలిచిన రామ్ చరణ్
X

(Video Credit to Vyjayanthi Network You Tube Channel)

దిశ, సినిమా : చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బీ గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన ప్రాజెక్ట్స్ ని రూపొందించిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై బడా నిర్మాత అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికి ఈ సినిమా డైలాగ్స్ ని ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు.. కథ దగ్గర నుంచి పాటలు వరకు ఆడియెన్స్ తో విజిల్స్ వేపించుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రను రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల హౌస్‌ఫుల్స్ అయ్యాయి.

అయితే, ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ అమ్మడు అప్పచ్చి .. అనే పాటను విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ హైలెట్ గా నిలిచారు. రామ్ చరణ్ సన్నగా, వైష్ణవ్ తేజ్ బొద్దుగా.. మొత్తానికి ఇద్దరూ చాలా ముద్దుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed