'ఇండియన్ 2'.. తాజా అప్డేట్

by Shiva |   ( Updated:2023-05-14 05:46:46.0  )
ఇండియన్ 2.. తాజా అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఇండియన్ 2'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన తైవాన్ మరియు దక్షిణాఫ్రికా షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. కమల్ హాసన్ ఇప్పటి వరకు చిత్రీకరించిన అన్ని సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. జులై నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ సంస్థ, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more:

SSMB 28- Mahesh babu : ‘మహేష్ 28’ టీజర్ స్పైసీ అప్‌డేట్

Advertisement

Next Story