- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవకన్యలా తమన్నా..బ్లాక్ లెహంగాలో అదిరిపోయిందిగా..
దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు మళ్ళింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తుంది.
అయితే తాజాగా అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ, రాధికమర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెడిషనల్ లుక్‌లో, స్షెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బంగారంతో చేసిన ఎంబ్రాయిడరీ లెంహగాలో తమన్నా అందరినీ ఆకట్టుకుంది. తక్కువ నెక్ లైన్‌తో ఉన్న డిజైనరీ బ్లౌజ్,పెద్ద దుప్పట, చెవులకు భారీ ఝుమ్కాలతో ఎంతో అందంగా కనిపించింది. ట్రెడిషనల్ లుక్‌లో బ్లాక్ లెహంగాలో తమన్నా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన వారందరూ బ్లాక్ లెహంగాలో తమన్నా కుందనపు బొమ్మలా ఉంది.. సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- Tamannaah Bhatia