HanuMan OTT : హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్

by Mahesh |   ( Updated:2024-03-14 13:48:04.0  )
HanuMan OTT :  హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన హనుమాన్ చిత్రం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ టో భారీ గ్రాఫీక్స్, వీఎఫ్‌ఎక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే గుస్ బంప్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో దేశవ్యాప్తంగా హనుమాన్ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా సాధించి భారీ లాభాలను అందుకుంది. ఇలాంటి హిట్ ను అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా.. అని సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా హనుమాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా అతి త్వరలో ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఓటీటీలో విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ట్విట్టర్ అకౌంట్ ను చూడండి అంటూ.. హనుమాన్ టీం ప్రకటించింది. ఇదిలా ఉంటే హనుమాన్ హిందీ వెర్షన్ శనివారం నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తెలుగు వెర్షన్ తేదీ కూడా అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story