ఇలియానా బేబీ బంప్ వీడియో వైరల్.. లైఫ్‌లో ఆలస్యమైందంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-05-04 14:50:38.0  )
ఇలియానా బేబీ బంప్ వీడియో వైరల్.. లైఫ్‌లో ఆలస్యమైందంటూ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. పెళ్లి కాకుండానే ఇటీవల ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, బేబీ బంప్ వీడియోను షేర్ చేసి మరోసారి సోషల్ మీడియాను షేర్ చేస్తుంది. ఇలియానా తన ఇన్‌స్టా స్టోరీలో బెబీ బంప్‌ను చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘ జీవితంలో ఆలస్యమైంది’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా లవ్ సింబల్ పెట్టి దిష్టి చుక్కను కూడా పెట్టడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా ఈ అమ్మడు కత్రినా కైఫ్ బ్రదర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్



Advertisement

Next Story