- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియాలో ఎవరూ కన్నెత్తి చూడని ఆ ప్రాంతంలో సాంగ్ షూట్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. దీంతో నిర్మాతలు స్వల్ప నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో అల్లు అర్జున్ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన వీడియోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సినిమాలోని "తెలుసా తెలుసా.. ప్రేమించానని" అనే పాటను ఇండియాలో ఇప్పటివరకు ఏ చిత్రం షూటింగ్ చేయని ప్రాంతంలో చేశారట. అంతేకాదు.. నాలుగు ఫ్లైట్లు మారడంతో పాటు 54 గంటల జర్నీ చేశారట. ఎవరు కన్నెత్తి కూడా చూడని ప్రాంతంలో మనం షూటింగ్ చేయాల్సిందే అని హీరో అల్లు అర్జున్ పట్టుబడటంతో చేశారట. దీనిని స్వయంగా అల్లు అర్జునే చెప్పారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.