- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్‌తో అలా చేయాలని నా కోరిక.. హీరోయిన్ రాశి కామెంట్స్ వైరల్!
దిశ, వెబ్‌డెస్క్: అందాల తార సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం రాశి బుల్లితెరలో పలు సీరియల్స్‌లో నటిస్తూ అలరిస్తోంది. ‘జానకి కలగనలేదు’ సీరియల్ ఎండింగ్ స్టేజ్‌కు వచ్చింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలని ఉంది. అది కూడా ఆయనతో హీరోయిన్ గా చేయాలి.. తల్లిగా అంటే అస్సలు చేయను. అయితే ఇప్పటివరకు నేను ప్రభాస్ ని చూడలేదు. కలిసి మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ చేసే సమయంలో ఒకే హోటల్ లో నేను, ప్రభాస్ ఉన్నాం. ఆ హోటల్ లో ప్రభాస్ ఉన్నాడని తెలిసి నేను ఎగిరి గంతేశాను. వర్షం తర్వాత అడవి రాముడు తీస్తున్నాడు. వర్షం సినిమా కూడా చూడలేదు. ఈశ్వర్ ట్రైలర్ లో చూసి ప్రభాస్ ను ఇష్టపడ్డాను.
ఇక ప్రభాస్ ను కలవాలి.. ప్రభాస్ కలవాలి అని అరుస్తుంటే మా అన్నయ్య .. ఏంటి.. ఇలా ఎగురుతున్నావ్.. నువ్వు చాలా మంది హీరోలతో చేసావ్ అని అన్నాడు. నేను వెంటనే ప్రభాస్ తో మాట్లాడాలి ఎలాగైనా.. కనీసం కలవలేను.. ఫోన్ లో అయినా మాట్లాడతా అని ఆయన ఉన్న రూమ్ కు కాల్ చేసి.. వర్షం సినిమా చూడకపోయినా.. మీ సినిమా చూశాను.. చాలా బాగుంది.. మీరు చాలా బాగున్నారు అని చెప్పాను. దానికి ప్రభాస్.. ఎంతో మర్యాదగా.. నిదానంగా థాంక్స్ అండి అని అన్నాడు. నేను వినడం అయితే ప్రభాస్ చాలా మంచి మనిషి అని విన్నాను. సీనియర్స్ కు చాలా మర్యాద ఇస్తారని విన్నాను’’ అంటూ రాశి చెప్పుకొచ్చింది.