- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా చిన్నప్పటి కల నెరవేరుతుందని అస్సలు ఊహించలేదు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అదే జోష్‌తో దూసుకెళ్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా మారిపోయింది. అయితే ఇటీవల రష్మిక ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అక్కడ పలు ప్లేస్‌లలో ఎంజాయ్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.
ఈ క్రమంలో.. తాజాగా, రష్మిక తన చిన్నప్పటి కల నెరవేరినట్లు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ జపాన్ ఎన్నో ఏళ్లుగా నేను కలలు కంటున్నాను. చిన్నప్పటి నుంచి జపాన్‌కు వెళ్లాలని కలలు కలగన్నాను. నిజంగా నెరవేరుతుందని ఊహించలేదు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో నేను భాగమై ఒకరికి అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడున్న వారంతా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు చూపించే ప్రేమ, వాతావరణం ఇక్కడ ప్రజలు, ఫుడ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. నాకు ఎంతగానో నచ్చాయి. జపాన్ నాకు చాలా స్పెషల్ ప్లేస్ ఐ లవ్ యూ జపాన్. ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ రావాలనుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.