చిరంజీవి నా కారు డోర్ తీయడం గిల్టీగా అనిపించింది: సుశాంత్

by Prasanna |   ( Updated:2023-08-05 10:06:07.0  )
చిరంజీవి నా కారు డోర్ తీయడం గిల్టీగా అనిపించింది: సుశాంత్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్న హీరోయిన్‌గా నటించగా చిరు చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీలకపాత్ర పోషించాడు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. ఆయన పాటలతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. అలాంటిది ఆయనతో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని అనుకోలేదు. నాకు డైరెక్టర్ మెహర్ రమేష్ ఫోన్ చేసి ‘భోళా శంకర్’ మూవీలో ఆఫర్ గురించి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతేకాదు చిరంజీవితో కలిసి స్టెప్పులేయించాలని మెహర్ రమేష్ నుంచి అప్పుడే మాట తీసుకున్న. అనుకున్నట్టుగానే ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం గొప్ప అనుభూతి ఇచ్చింది. ఇక ఒక మూవీలోని ఓ సన్నివేశంలో ఆయన ట్యాక్సీ డ్రైవర్.. నేను కారులో నుంచి దిగుతుంటే ఆయన కారు డోర్ తీయాలి. ఆ సీన్‌లో ఆయన డోర్ చూస్తుంటే నాకు చాలా గిల్టీగా అనిపించింది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం రావడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు సుశాంత్.

Read More: మీ అభిమానం చూస్తుంటే భయమేస్తోందంటూ.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ నోట్

మెగాస్టార్ VS సూపర్ స్టార్.. బరిలో గెలిచేదెవరు!

Advertisement

Next Story