AmeerKhan- Kiranrao: అతనితో విడాకుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్

by Kavitha |
AmeerKhan- Kiranrao: అతనితో విడాకుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా చాలా మంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకుని పట్టుమని పది కాలాల పాటు కలిసి ఉండలేక తమ వైవాహిక బంధానికి ముగింపు కార్డు పలికిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా విడాకుల ప్రస్తావన వింటున్నాము. అయితే చాలా మంది విడాకులు తీసుకున్న తర్వాత ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ, కొన్ని జంటలు చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ కలిసే ఉంటారు. అలా విడాకులు తీసుకుని కలిసి ఉన్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు ఒకరు.

2005లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు 15 ఇయర్స్ పాటు కలిసే ఉన్నారు. ఇక ఇన్నేళ్ల కాపురం తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. అయితే చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోయారు కానీ వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రావు.. అమీర్ ఖాన్‌తో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. " అమీర్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత నేనేమి బాధపడలేదు.. అలాగే విడాకుల విషయంలో నేను అస్సలు కుంగిపోకుండా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే సుమారు 16 ఏళ్లుగా కలిసి ఉన్న ఒక వ్యక్తితో తాను విడిపోవాలి అనుకున్నప్పుడు ఎమోషనల్‌గా మానసికంగా తట్టుకుని నిలబడినట్లు కిరణ్ తెలిపింది.

అమీర్ ఖాన్‌తో రిలేషన్‌కు ముందు నుంచే నేను చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నా. దాంతో నాకు ఇండిపెండెంట్‌గా ఉండటం అప్పటి నుంచే అలవాటు అయ్యింది. కాబట్టి నేను బాగానే ఉండగలను. అయితే చాలా మంది విడాకులు తీసుకున్నప్పుడు కాని, పార్టనర్‌ను పోగొట్టుకున్నప్పుడు కాని మానసికంగా, ఎమోషనల్‌గా వీక్ అయిపోతారు. కానీ నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే.. రెండు ఫ్యామిలీల నుంచి సపోర్ట్ ఉంది. అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను” అంటూ కిరణ్ రావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story