బిగ్‌బాస్ షోకు వెళ్లినప్పుడు అందుకే ఎఫైర్ పెట్టుకోలేదు.. దివి సెన్సేషనల్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-03-28 14:17:43.0  )
బిగ్‌బాస్ షోకు వెళ్లినప్పుడు అందుకే ఎఫైర్ పెట్టుకోలేదు.. దివి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా తన పాపులారిటీ పెంచుకుంది. దివి సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో ప్రత్యేక ప్లేస్ సంపాదించుకుంది. అయితే ఇటీవల దివి ‘లంబసింగి’ సినిమాతో హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మార్చి15 థియేటర్స్‌లో విడుదలైంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి బిగ్‌బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళకూడదని అనుకున్నాను. అందులోకి వెళ్తే.. కెరీర్ నాశనం అవుతుంది. నాకు వస్తున్న ఆఫర్స్ కూడా ఈ షోకు వెళ్లి వచ్చాక రావేమో అని అనుకున్నాను. అందుకే చాలా మంది సలహా తీసుకున్నాకే బిగ్‌బాస్ షోకు వెళ్ళాను. కానీ పోయేముందే డిసైడ్ అయ్యాను. నేను పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు రావాలని అనుకున్నాను. అందుకే ఎఫైర్స్ పెట్టుకోలేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చాక నాకు వచ్చిన కొన్ని ఆఫర్లు కూడా చేజారాయి.

ఒక ప్రాజెక్ట్ ఒకే చేసి పని స్టార్ట్ చేసేవరకు మనది అనుకోవడానికి విల్లేదు. ఎందుకంటే అంతలోనే అదే పాత్రలో వేరేవాళ్లు కూడా నటించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ఆఫర్ పోకుండా ఉండాలంటే.. మేకర్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. అణిగిమణిగి ఉంటేనే వారు పట్టించుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story