Vishnu Priya: నేను తుప్పు పట్టి పోయిన పీస్.. ఆమె ఫ్రెష్ పీస్: విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
Vishnu Priya: నేను తుప్పు పట్టి పోయిన పీస్.. ఆమె ఫ్రెష్ పీస్: విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సీరియల్స్, జబర్దస్త్ వంటి షోల ద్వారా ఫేమస్ అయిన రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రీతు 'దావత్' అనే ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. విష్ణుప్రియ మాత్రం కొంతకాలంగా యంకరింగ్‌కి దూరంగా ఉంటూ.. మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలపై కాన్సంట్రేషన్ చేస్తుంది. అయితే రీతూ చౌదరి, విష్ణుప్రియ ఇద్దరూ జాన్ జిగిరీ దోస్తులు అన్న సంగతి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి ఖాళీ దొరికినప్పుడల్లా వెకేషన్ అంటూ విదేశాలకు చెక్కేస్తుంటారు. అలానే సోషల్ మీడియాలో రీల్స్, ఫన్నీ వీడియోలు చేస్తూ తమ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' అనే షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ, రీతు చౌదరి కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తమ ఫ్రెండ్‌షిప్, షోలు, వెకేషన్‌లు వంటి వాటిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందులో భాగంగా 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోకి ఇద్దరినీ కలిపి ఒకసారే జంట ప్యాకేజీ కింద తీసుకున్నారా అంటూ యాంకర్ అడగగా.. ప్యాకేజ్ ఏం లేదు సెపరేట్ సెపరేట్ పేమెంట్స్‌యే. మమ్మల్ని ఇద్దరినీ విడివిడిగానే అప్రోచ్ అయ్యారు.. అంటూ రీతూ ఆన్సర్ ఇచ్చింది. కానీ విష్ణుప్రియ మాత్రం వెటకారంగా.. "మా రీతూ గారు ఒక టాక్ షో వల్ల బాగా ఫేమస్ అయి.. ఇన్‌స్టా రీల్స్‌లో ఇలా ఎక్కడ చూసినా ట్రెండింగ్ తనే ఉందని.. ఈ గొప్ప పీస్‌ను ఎంచుకోవడం జరిగింది.. నేను ఓ తుప్పు పట్టి పోయిన పీస్.. ఈమె చాలా రోజులు అయింది తుప్పుపట్టి.. మనం తక్కువలో పిలిస్తే వస్తుందేమోనని నన్ను పిలిచారు. నేను కూడా బాలి వెళ్లడం జరిగింది. సర్లే పేమెంట్‌కి హెల్ప్ అవుతుందని వచ్చాను." అంటూ విష్ణు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story