- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఫ్యాన్స్ కి భారీ గుడ్ న్యూస్ .. ‘మాస్’ మళ్లీ వచ్చేస్తున్నాడు.. రీరిలీజ్ ఎప్పుడంటే..?
దిశ, సినిమా : టాలీవుడ్లో కొద్దీ రోజుల నుంచి రీరిలీజ్ హవా నడుస్తోంది నిజంగా చెప్పాలంటే ఇది ట్రెండ్ చేసిందనే చెప్పుకోవాలి. స్టార్ హీరోస్ బర్త్ డే రోజు, స్పెషల్ డేస్ లలో ఇప్పటి వరకు రీరిలీజ్ లు చేస్తుండగా.. వారి అభిమాన తారల సినిమాలను చూసేందుకు అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయినా మూవీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయినా మూవీకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు మేకర్స్.
ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం సూపర్ హిట్ అయినా మూవీ మాస్ మూవీని రీరిలీజ్ చేయనున్నారు. రాఘవ లారెన్స్ డైరెక్షన్ చేసిన మాస్ మూవీలో నాగార్జున హీరోగా నటించగా.. జ్యోతిక హీరోయిన్ గా నటించింది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన మాస్ మూవీ 2004లో రిలీజ్ కాగా, మంచి వసూళ్లను రాబట్టింది. అప్పట్లోనే మ్యూజికల్ హిట్ గా కొట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది. 20 ఏళ్ల తర్వాత నాగార్జున బర్త్ డే సందర్భంగా అంటే ఒక రోజు ముందుగా ఆగస్ట్ 28న విడుదల చేయనున్నారు.
Read More..
Bigg Boss - Season 8: బిగ్‌బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి హీరో.. ఎవరంటే!!