Mathu Vadalara 2: హిట్ కొట్టిన ‘మత్తు వదలరా 2’ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

by Prasanna |   ( Updated:2024-09-16 02:13:19.0  )
Mathu Vadalara 2: హిట్ కొట్టిన  ‘మత్తు వదలరా 2’ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ తోనే సింహా కోడూరి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ తర్వాత.. వచ్చిన సినిమాలన్నీ ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేదు. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ మన ముందుకు వచ్చింది . సెప్టెంబర్ 13న ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి రెండు రోజులు కలెక్షన్స్ చూసుకుంటే గమనిస్తే..

నైజాం - 01.32 CR

సీడెడ్ - 0.39 CR

ఆంధ్ర(టోటల్) - 0.85 CR

ఏపీ + తెలంగాణ(టోటల్) - 02.56 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.35 CR

ఓవర్సీస్ - 01.90 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 04.81 CR

మత్తు వదలరా 2’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. అయితే, రెండు రోజులకే ఈ మూవీ రూ.4.81 కోట్లు షేర్ ని వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా…. రూ.0.81 కోట్ల ప్రాఫిట్స్ ను కూడా తెచ్చి పెట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ మూవీ దూసుకెళ్తుంది.

Advertisement

Next Story

Most Viewed