అరుంధతి సినిమాలో బాలనటి.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా?

by samatah |   ( Updated:2022-10-27 05:16:38.0  )
అరుంధతి సినిమాలో బాలనటి.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అరుంధతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మూవీ ఇప్పటికీ ఎంతో మంది గుండెల్లో చెదిరిపోని చిత్రంగా మిగిలి పోయింది. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమా, అనుష్క్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 2009లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. అలాగే ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా మూవీలో ప్రతి ఒక్కరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.



మరీ ముఖ్యంగా చెప్పాలంటే, అనుష్క చిన్నప్పటి పాత్రలో చేసిన దివ్య నగేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసింది కొన్ని నిమిషాలే అయినా, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ వరుడు సినిమాలో దివ్య అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాదికి హీరోయిన్‌గా మారింది. 2011లో వచ్చిన 'ప్రసకార నన్‌బర్‌గల్‌' అనే తమిళ సినిమాలో లీడ్‌ రోల్‌ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాలంలో చాలా బిజీగా గడుపుతోంది.




Advertisement

Next Story

Most Viewed