Honey Rose: నాకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు.. హనీ

by Prasanna |
Honey Rose: నాకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు.. హనీ
X

దిశ, సినిమా : స్టార్ నటి హనీ రోజ్ తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదంటోంది. ఇటీవల వచ్చిన బాలకృష్ణ సినిమా ‘వీరసింహా రెడ్డి’తో భారీ పాపులారిటీ దక్కించుకున్న నటి.. తాజాగా ఓ ఈవెంట్‌లో భాగంగా తన కెరీర్ అనుభవాలు షేర్ చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మదీనా గూడలో జైలు థీమ్‌తో కూడిన ‘జిస్మత్ మండీ’ని ప్రారంభించిన హనీ.. హైదరాబాద్‌తో మమేకమవడం ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే ‘వీర‌సింహా రెడ్డి’లో తన పాత్రకు లభించిన ప్రశంసలు చూస్తే కల నిజమైనట్టు ఉందని చెబుతూ.. ‘సినిమాలు తప్ప నాకు వేరే లోకం తెలియదు. 14ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. బాలయ్యతో నటించడం అరుదైన అవకాశంగా భావించాను. సోషల్ మీడియాలో మంచి, చెడు రెండు ఉంటాయి. అన్నింటినీ ఎంజాయ్ చేస్తా. ఇకపై రొమాంటిక్ పాత్రలు చేయాలని ఉంది. నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story