Raveena Tandon: షారుక్ ఖాన్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కారణం చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీ!

by sudharani |   ( Updated:2024-08-16 14:20:31.0  )
Raveena Tandon: షారుక్ ఖాన్ సినిమానే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కారణం చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీ!
X

దిశ, సినిమా: తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న రవీనా టాండన్.. బాలీవుడ్‌లో మాత్రం వరుస మూవీస్‌తో సందడి చేస్తుంది. 2022లో ‘కేజీయఫ్ 2’లో రమికాసేన్ పాత్రలో మెప్పించిన ఈమె.. ప్రజెంట్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో యాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా.. షారుక్ ఖాన్ సినిమా రిజెక్ట్ చెయ్యడానికి గల కారణాలను చెప్పింది.

‘బిగ్ బి షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమాకు మొదట నన్నే హీరోయిన్‌గా అడిగారు. కథతో పాటు ఆ చిత్రంలో నా పాత్ర కూడా నాకు ఎంతో నచ్చింది. ఇక మూవీపై సైన్ చేసే క్రమంలో కాస్ట్యూమ్స్ గురించి తెలిపారు. ఆ సినిమాలో నేను వేసుకునే దుస్తుల గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంత సౌకర్యంగా అనిపించలేదు. అందుకే రిజెక్ట్ చేశాను. చిన్న విషయానికి సినిమా ఎందుకు వదులుకుంటున్నావు.. తర్వాత చాలా మూవీస్ చెయ్యాలి అని అన్నారు. కానీ కాస్ట్యూమ్స్ వల్ల నేను చెయ్యలేకపోతున్న అని చెప్పగానే అర్థం చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. షారుక్ ఖాన్, రవీనా టాండన్ కలిసి ‘యే లమ్హే జుదాయి కే’, ‘జాదు’, ‘జమానా దివానా’ వంటి సినిమాలు చేశారు. ఆ తదుపరి చిత్రాన్నే రవీనా రిజెక్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed