చిన్న మాట అన్న తండ్రికే చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్.. ఎలాగైన కక్ష్య తీర్చుకుంటా?

by Anjali |   ( Updated:2024-07-17 02:52:12.0  )
చిన్న మాట అన్న తండ్రికే చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్.. ఎలాగైన కక్ష్య తీర్చుకుంటా?
X

సినిమా: ఒకప్పటి యూత్ కలల రాణి హారోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, నటన, డాన్స్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. కేవలం తెలుగులో కాకుండా ఈ బ్యూటీ మలయాళం, తమిళం, కన్నడ, హిందీలోనూ నటించి తన సత్తా చాటింది. ఒకే సమయంలో నాలుగైదు లాంగ్వేజేస్‌లో చిత్రాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకుంది. రంభ మూవీస్ ఏకంగా ఏడాదికి కనీసం 10 సినిమాలైన విడుదలయ్యేది. తర్వాత ఈ అమ్మడు ఐటెమ్ సాంగ్స్‌లో మెరిసి.. కుర్రకారుకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. తన ఫ్యామిలీలో టైమ్ స్పెండ్ చేస్తోంది. ఇకపోతే రంభ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఫన్నీ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ హీరోయిన్‌ను ఎవరైనా తిడితే అస్సలు ఊరుకోదని.. తిరిగి వారిపై ఎలాగైన కక్ష్య తీర్చుకుంటాని, తిరిగి వారంతట వారు రియలైజ్ అయ్యేంతవరకు టార్చర్ చేస్తూనే ఉంటానని రంభ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే రంభ చిన్నతనంలో తన తండ్రి ఏదో విషయంలో తిడితే 6 నెలల పాటు చుక్కలు చూపించిందట. ఆయనతో మాట్లాడకుండా ఇబ్బందిపెడుతూ ఉండేదట. కానీ మళ్లీ చాటుకు వెళ్లి నవ్వేదంట. ఇంట్లో ఎవరేమన్నా.. అలిగి మెట్ల కింద దాచుకునేదట. తండ్రి షాప్‌కెళ్లి వచ్చేంతవరకు అక్కడే ఉండేదట. తన తప్పు ఉంటే వెంటనే సారీ చెబుతానని.. కానీ ఎవరైన అనవసరంగా తిడితే మాత్రం అస్సలు ఊరుకోనని రంభ చెప్పుకొచ్చింది. అలాగే తనకు జీరో సైజ్ మెయింటైన్ చేయడం రాదని తెలిపింది. స్వీట్ అంటే ఇష్టమని, కాగా ఎక్కువగా తింటానని, ప్రస్తుతం తన భర్త, పిల్లలతో హ్యాపీగా విదేశాల్లో సెటిల్ అయ్యానంటూ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed