పదేళ్లుగా డేటింగ్‌.. ప్రియుడితో పెళ్లి ప్రకటించిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్

by Anjali |
పదేళ్లుగా డేటింగ్‌.. ప్రియుడితో పెళ్లి ప్రకటించిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ‘భీమా, కల్యాణం కమనీయం, ధూత(వెబ్ సిరీస్), భారతీయుడు-2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అంతేకాకుండా సీనియర్ అగ్ర హీరోలైన విశాల్, ధనుష్, కార్తి వంటి హీరోలతో కూడా నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇకపోతే ప్రియ భవానీ నటించిన డీమాంటీ కాలనీ-2 చిత్రం ఈ నెల (ఆగస్టు) 15 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో హీరోయిన్ ప్రియ భవానీ అభిమానులకు ఓ భారీ శుభవార్త అందించారు. పదేళ్లుగా రాజ్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని తెలిపింది.

వచ్చే ఏడాదిలో అతడితో తన పెళ్లని ప్రకటించింది. అప్పట్లో తన పుట్టిన రోజున పలువురు బర్త్ డే విషెష్ చెబితే లింక్ కట్టారని తెలిపింది. చదువు కంప్లీట్ అయ్యాక పెళ్లి ప్రపోజల్ వస్తే రాజ్‌తో ఇప్పటికే నా పెళ్లి అయిపోయుండేదని పేర్కొంది. రాజ్ ప్రియా భవానీ జీవితంలోకి రావడం ఎంతో సంతోషం అని ఆనందం వ్యక్తం చేసింది. రాజ్ కనుక ఈ హీరోయిన్ లైఫ్‌లోకి రాకపోతే తను ఒక మధ్య తరగతి కుటుంబ యువతిలాగే మిగిలిపోయేదని చెప్పుకొచ్చింది. తన ప్రియుడు అందించిన ప్రోత్సాహమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని లవర్ రాజ్ గురించి ప్రియా భవానీ ప్రకాష్ గర్వంగా వెల్లడించింది. ఈ వార్త విన్న నెటిజన్లు ఎవరికి తెలియకుండా పదేళ్లుగా డేటింగ్ చేశావా? యంగ్ బ్యూటీ మామూలు చిన్నది కాదండోయ్ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed