- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత
దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. డ్రగ్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నవదీప్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది. విచారణకు హాజరుకావాల్సిందిగా అతడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఇటీవల నవదీప్ పట్టుబడగా.. అతడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ క్రమంలో నవదీప్ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు.. మంగళవారం వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణకు వాయిదా వేసింది. ఇవాళ మళ్లీ విచారణ జరగ్గా.. నవదీప్‌కు బెయిల్ ఇవ్వొద్దని నార్కోటిక్ పోలీసులు బలంగా వాదించారు. దీంతో వారి అభిప్రాయాలతో ఏకీభవించిన కోర్టు.. నవదీప్ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.