- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు నెలలకే ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఏంజెల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కుమారి 21ఎఫ్ సినిమాలతో హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న హెబ్బా ఇటీవల హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చైతన్య రావు హీరోగా నటించగా.. బాల రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.
ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో నిర్మించారు. అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా జూన్ 21న థియేటర్స్‌లో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ విడుదలైన రెండు నెలలకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఆగస్టు 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.