గుండె బద్దలైంది మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతా.. హీరోయిన్ ఛార్మీ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-02-20 08:34:25.0  )
గుండె బద్దలైంది మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతా.. హీరోయిన్ ఛార్మీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకు ప్రోడ్యూసర్‌గా వ్యవహరించింది. ఈ చిత్రం భారీ డిజాస్టర్ అందుకోవడంలో తదుపరి ఏ మూవీ ప్రకటించలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌కు ఈ అమ్మడు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

అయితే ఛార్మీ ఇటీవల నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన కుక్క పిల్ల చనిపోయినట్లు తెలుపుతూ చేసిన పోస్ట్ ఫుల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఛార్మీ ఇంట్లో తీవ్ర విషయం నెలకొంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె మరోసారి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన అంకుల్ చనిపోయినట్లు తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘మా అత్యంత బలమైన కుటుంబ సభ్యుడు కక్కి మామయ్య. అలాంటి వారు ఆకస్మాత్తుగా చనిపోయారన్న వార్త విని చాలా షాక్ అయ్యాను. నా గుండె బద్దలైనట్టుగా అనిపిస్తుంది.

అసలు జీవితం ఖచ్చితంగా అనూహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ మాసీ, స్వీడల్, నైకీ, కెన్నీ, ప్లీజ్ దృఢంగా ఉండండి. మీకు బోలెడంత బలం, ప్రార్థనలు పంపుతున్నాను. పిక్ 2, ఇది ఒక రోజు క్రితం క్లిక్ చేసింది. అతని కుటుంబంతో చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఛార్మీ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన ఫ్యాన్స్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Read More..

‘టిల్లు స్వ్కేర్‌’ ఓటీటీ డీల్ కోసం పోటీపడుతోన్న అమెజాన్, నెట్ ప్లిక్స్.. చివరకు?


Advertisement

Next Story