హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది.. అనుపమ పోస్ట్‌పై నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా

by sudharani |   ( Updated:2024-03-18 10:11:06.0  )
హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది.. అనుపమ పోస్ట్‌పై నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో కుర్రళ్లను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ‘శతమానం భవతి’ సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంటోంది. కానీ, బాక్సాఫీస్ హిట్ మాత్రం ఒక్కటి కూడా పడలేదు. ఇక ఇటీవల వచ్చిన ‘ఈగల్’ చిత్రం కూడా అంతంత మాదిరిగానే ఉండటంతో.. ప్రస్తుతం అనుపమ ఆశలన్ని ‘టిల్లు స్వ్కేర్’ పైనే పెట్టుకుంది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అనుపమ ఊహించని రీతిలో గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్‌లో అమ్మడు పర్ఫామెన్స్ మాములుగా లేదు. దీంతో అభిమానులు కూడా కొంత షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే అనుపమ నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను, ఈవెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్‌కు అదిరిపోయే రిప్లైలు ఇస్తున్నారు నెటిజన్లు.

ఇక తాజాగా అనుపమ తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్ బర్త్‌డే కావడంతో.. ‘మా స్మాల్ తమ్ముడు బర్త్‌డే’ అంటూ అతడితో ఉన్న ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదు. ‘బామ్మర్ది హ్యాపీ బర్త్‌డే’ అని కొందరు రిప్లైలు ఇస్తుంటే.. ‘బామ్మర్ది మీ అక్కను బాగా చూసుకోరా’ అంటూ మరికొందరూ ఫన్ని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

ఆ విషయంలో ఒత్తిడికి గురవుతున్న.. రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలియా భట్‌

Advertisement

Next Story

Most Viewed