- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ పండగ నాడే స్ట్రీమింగ్
దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసును ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తి లేదు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలై రికార్డులు కొల్లగొట్టింది. సంక్రాంతి బరిలో దిగిన సీనియర్ స్టార్ హీరో సినిమాలను సైతం దాటేసి బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు కాసుల పంట పండించింది.
రూ. 300 కోట్ల పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని సినీ ప్రియులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాల కానుకగా హనుమాన్ మార్చి 8 వ తారీకున స్ట్రీమింగ్ అవ్వనుందని జీ 5 ఓటీటీ సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది.