- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hanuman: 3D లో వచ్చేస్తున్న హనుమాన్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్
దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
అయితే.. త్వరలోనే ‘హనుమాన్’ జపాన్‌లో రిలీజ్ కానుంది. అక్టోబర్‌లో ఆ దేశంలో మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు డైరెక్టర్. ఈ మేరకు ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ఆయన.. ‘మేము హనుమాన్‌ను ఇప్పుడు 3డీలోకి మార్చాం. అంతర్జాతీయ వెర్షన్‌లన్నీ 3డీలోనూ రిలీజ్ అవుతాయి. అయితే జపాన్‌లో రిలీజ్ సమయంలోనే ఇండియాలోనూ పలు ఎంపిక చేసిన థియేటర్లలో హనుమాన్ 3డీ వెర్షన్ రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో పండుగ చేసుకుంటున్నారు ప్రేక్షకులు.