- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకప్ నుంచి కోలుకోవడానికి ఏడేళ్లు పట్టింది: హన్సిక
దిశ, సినిమా: తమిళ నటుడు శింబుతో బ్రేకప్ ఇష్యూపై నటి హన్సిక ఓపెన్ అయింది. 'లవ్ షాదీ డ్రామా' తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. భర్త సోహైల్ ప్రపోజ్‌ను అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నట్లు తెలిపింది. 'మొదటి బ్రేకప్ తర్వాత స్వచ్ఛమైన ప్రేమకోసం వెయిట్ చేశా. మరొకరి ప్రేమలో పడటానికి ఏడేళ్లు పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది. నేనూ రొమాంటిక్ అమ్మాయినే.
కానీ, నాకు ప్రేమను వ్యక్తపరచడం తెలియదు. వివాహ వ్యవస్థను బలంగా నమ్ముతా. అందుకే నాతో జీవితం పంచుకునే వ్యక్తిని ఎంచుకునేందుకు చాలా సమయం తీసుకున్నా. సోహైల్ కథూరియా కూడా నా ప్రేమ కోసం చాలా ఎదురుచూశాడు. అతను నన్ను ఎలా ప్రేమిస్తాడో మాటల్లో చెప్పలేను. ఇక ఫస్ట్ లవ్ అనేది ముగిసిన కథ. దేవుడే నాకు మంచి రూట్ చూపించాడు. అలాగే అందరి జీవితాల్లోనూ కొత్త ఆరంభం ఉంటుందనే పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకెళ్తా' అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.