ఆమె ప్రియుడిని బుట్టలో వేసుకున్న హేలీ.. భారీ కుంభకోణమంటున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2022-10-01 12:19:22.0  )
ఆమె ప్రియుడిని బుట్టలో వేసుకున్న హేలీ.. భారీ కుంభకోణమంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : అమెరికన్ మోడల్ హేలీ బీబర్.. స్టార్ సింగర్ సెలీనా గోమెజ్‌ను మోసం చేసి జస్టిన్ బీబర్‌ను బుట్టలోవేసుకుందనే పుకార్లపై స్పందించింది. 2018లో జస్టిన్ బీబర్‌ను పెళ్లిచేసుకున్న హేలీ.. తన భర్తను మాజీ ప్రేయసి సెలీనా దగ్గరనుంచి బలవంతగా లాక్కోలేదని, తప్పుడు సమాచారంతో తనపై అభిమానులు విరుచుకుపడటం సరైన పద్ధతి కాదని చెప్పింది. 'ఇలాంటి పిచ్చి వాదనలు వింటే ఎదోలా ఉంటుంది. నిజంగా వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు ఎక్కడ వినలేదు. ఎప్పుడూ మాట్లాడలేదు. ద్వేష పూరితంగానే నాపై ఆరోపణలు చేస్తున్నారు. సెలినాను మోసం చేసి జస్టిన్‌ను దక్కించుకున్నానని, దీన్ని భారీ కుంభకోణం అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం బాగోలేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆన్‌లైన్ ద్వేషం జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్‌లో భయంకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ పాత రోజులు గడిచిపోయాయి. కాబట్టి దానిగురించి మాట్లాడి నా లైఫ్‌ను ఇబ్బందుల్లో పడేసుకోలేను' అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి : నడుము, బొడ్డు అందాలతో రచ్చ చేస్తున్న Ananya Nagalla

Advertisement

Next Story