‘శ్వాగ్’ నుంచి 'గువ్వ గూటిలో'..

by sudharani |
‘శ్వాగ్’ నుంచి గువ్వ గూటిలో..
X

దిశ, సినిమా: కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్వాగ్’. టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన టీజర్‌లో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో, డిఫరెంట్ టైమ్‌లైన్‌లలో అద్భుతంగా ఆలరించారు. ఇందులో తాజాగా ‘శ్వాగ్’ నుంచి సెకండ్ సింగిల్ ‘గువ్వ గూటిలో’ విడుదల చేశారు. ఈ పాట 80, 90ల స్టయిల్ విజువల్ ఎసెన్స్, రెట్రో బీట్‌లు, స్టైలిష్ కొరియోగ్రఫీతో వింటేజ్ నాస్టాల్జిక్ డైవ్ ప్రజెంట్ చేస్తోంది. కలర్ ఫుల్ జాతర నేపథ్యంలో సెట్ చేయబడిన ‘గువ్వ గూటిలో’ సాంగ్ ప్రజెంట్ గణేష్ చతుర్థి పండగ ట్రీట్‌లా అలరిస్తుంది. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Next Story