Guppedantha Manasu: మను దత్తతకి ఎందుకు ఒప్పుకున్నాడంటే..?

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: మను దత్తతకి ఎందుకు ఒప్పుకున్నాడంటే..?
X

దిశ, సినిమా : గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

నేను ఈ నేరం చేశాన‌ని మీరు అనుకుంటున్నారా.. ఆ రాజీవ్‌ను నేను చంపానని మీరు న‌మ్ముతున్నారా అని అనుప‌మ‌ను, మను అడుగుతాడు. నువ్వు ఏ త‌ప్పు చేయలేదు.. చెయ్యవు కూడా.. నువ్వు నా పెంప‌కంలో పెరిగావు అని మ‌న‌సులో చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటుంది. కానీ, అది బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌పోతుంది.

నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి ఉత్త‌ముడి జీవితాన్ని నేను నాశ‌నం చేస్తున్నాను. నిన్ను చాలా కష్ట పెట్టిస్తున్నాను అని మ‌న‌సులో మ‌నుకు సారీ చెబుతుంది.

అనుప‌మ క‌న్నీళ్లు చూసి తట్టుకోలేక నేను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని గట్టిగా చెబుతాడు. నేను మీ దగ్గర పెరిగాన‌ని చెబుతాడు. అమ్మ అని కాకుండా మేడ‌మ్ అనే పిలుస్తాడు. ఈ భూమిపై తనకి తన తండ్రిపై త‌ప్ప ఎవరి మీద ద్వేషం, కోపం లేవ‌ని, నా తప్పు లేకుండా నన్ను ఇరికించిన వాళ్లని వ‌దిలిపెట్ట‌న‌ని అంటాడు. తండ్రి ఎవ‌రో తెలుస్తుంద‌నే నేను ద‌త్త‌త‌ను ఒప్పుకున్నా అని అనుప‌మ‌తో చెబుతాడు. మ‌ను. ఒక‌వేళ నేను ప్రాణాలు తీయాల్సివ‌స్తే అత‌డి ప్రాణ‌మే తీస్తాన‌ని చెబుతాడు.

Next Story

Most Viewed