cockroaches : ప్రపంచాన్నే వణికిస్తున్న ఒకే ఒక చిన్న కీటకం.. డైనోసార్లకంటే భయంకరంగా..

by Javid Pasha |
cockroaches : ప్రపంచాన్నే వణికిస్తున్న ఒకే ఒక చిన్న కీటకం.. డైనోసార్లకంటే భయంకరంగా..
X

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు వినడానికి సింపుల్‌గా అనిపిస్తుంటాయి కానీ.. అవి మాత్రమే తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని సమస్యలు ఇతరులు చెప్తుంటే విని ఓష్.. అంతేనా.. అనుకుంటాం కానీ.. వాటి బాధ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవారికే బాగా అర్థం అవుతుంది. ప్రజెంట్ బొద్దింకల విషయంలోనూ అదే జరుగుతోంది. చూడటానికి చిన్నగానే ఉండే ఈ కీటకాలు ఇండ్లల్లో, ఆఫీసుల్లో తిరగాడుతూ పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని పారదోలడానికి ఎంత ప్రయత్నించినా చాలామంది విఫలం అవుతున్నారు. ఎందుకిలా?

శరీర నిర్మాణంలోనే ప్రత్యేకతలు

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కీటకాల్లో బొద్దింకలు ఒకటి. పరిమాణంలో చిన్నవే అయినా ఇవి అన్ని రకాల పర్యావరణ, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మనగలుగుతున్నాయి. వ్యర్థ పదార్థాలు, సబ్బులు, వాల్ పేపర్, పెయింట్, టపాసుల జిగురు, గుడ్డ ముక్కలు, బుక్ బైడింగ్‌లు, కేబుల్ వైర్లు.. ఇలా ప్రతిదీ వీటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు బొద్దింకలు తమ శరీర నిర్మాణంలోనే ప్రత్యేక లక్షణాలు, సామర్థ్యాలు కలిగి ఉంటాయని చెప్తున్నారు. అందుకే ఎవరైనా బొద్దింకల పట్టుకున్నప్పటికీ ఆ సందర్భంలో అవి పట్టుకున్న కాళ్ల భాగం నుంచి తమ శరీరాన్ని తెంచేసుకొని పారిపోతాయి. తర్వాత వాటికి కొత్త కాళ్లు కూడా వస్తాయి.

డైనోసార్లకంటే కంటే బలమైనవి!

శత్రువుల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను తాము రక్షించుకునే ఈ ప్రత్యేక లక్షణాలు బొద్దింకలలో సహజంగానే ఉంటున్నాయి. కాబట్టి అవి డైనోసార్లకంటే బలవంతమైనవని, భూమిపై అణుయుద్ధం జరిగినప్పటికీ అవి మనుగడసాగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి శారీరక లక్షణాల మూలంగానే పురాతన కాలంలో గ్రహశకలాలు భూమిని ఢీకొన్నప్పుడు, డైనోసార్లు నశించాయి కానీ బొద్దింకలు మాత్రం మనుగడ సాగించాయని చెప్తున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా..

ఎటువంటి వెదర్‌‌లో అయినా తట్టుకోగలిగేలా బొద్దింకలు తమ శరీరాలను కుదించుకుంటాయి. పైగా వాటి శరీరాలు చదునుగా ఉంటాయి. దీని కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈజీగా తప్పించుకోగలుగుతాయి. ఎండ, వాన, వివిధ పరిస్థితుల్లో తాకిడి, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవించినప్పుడు చాలా జంతువులు ఇబ్బంది పడుతుంటాయి. వాటికి తలదాచుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బొద్దింకలకు ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. అవి ఏ పరిస్థితుల్లోనైనా చిన్న ఆకుచాటునో, నేల పగుళ్లలోనో ఆశ్రయం పొందుతాయి.

ప్రమాదాన్ని పసిగట్టగానే..

ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని పసిగట్టగానే అవి తమ శరీరాన్ని కుంచింపజేసుకుని గుండ్రంగా ముడుచుకుంటాయి. అందుకే ప్రస్తుతం విపరీతమైన చలి ప్రాంతమైన అంటార్కిటికాలో మినహా ప్రపంచ వ్యాప్తంగా బొద్దింకలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. అంటార్కిటికా వాతావరణంలో కూడా మూడు రోజులు బతికేస్తాయట. శాస్త్రవేత్తల ప్రకారం.. బొద్దింకలు 35 మిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూమిపై మనుగడ సాగిస్తు్న్నాయి. వీటిని శాశ్వతంగా ఎలా నివారించాలో ఇప్పటికీ పరిష్కారంలేని సమస్యగానే మిగిలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed