- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుల్లితెర నుంచి తప్పుకుంటున్న గుప్పెడంత మనసు రిషి.. సీరియల్ టైమింగ్ మార్చడానికి కారణం ఇదే..!
దిశ, సినిమా: స్టార్ మా లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి సీరియల్ రేటింగ్ పడిపోయింది. దీనికి కారణం జగతీ క్యారెక్టర్ ని చంపేయడం, ఆ తర్వాత సీరియల్ హీరో రిషి కనిపించకపోవడం. ఈ రెండు ఒక దాని ఒకటి తర్వాత జరగడం వలన సీరియల్ అభిమానులు కూడా నిరాశ చెందారు. మా అభిమాన నటులు లేకుండా మేము ఎవరి కోసం సీరియల్ చూడాలంటూ కొన్ని వేల కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టారు. వీటికి స్పందించిన సీరియల్ మేకర్స్ రిషిని తీసుకొచ్చారు. దీంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇదే సమయంలో ముఖేష్ గౌడ (రిషి ) అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పనున్నారు. అతి త్వరలో రిషి బుల్లితెరకి గుడ్ బై చెప్పనున్నారు. దీనికి ప్రధాన కారణం ముఖేష్ రెండు పడవల మీద కాలు పెట్టడం. వెండి తెర సినిమా( గీతా శంకరం ) కోసం బుల్లి తెర సీరియల్ ను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా షూటింగ్ అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయొచ్చు కానీ.. కానీ సీరియల్ అనేది రోజూ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి.. డైలీ షూట్ ఉంటుంది. సీరియల్ చేస్తూ సినిమాలు చేయడం చాలా కష్టమే. ఇన్ని రోజులు తప్పక మేనేజ్ చేసారు.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే .. రిషి ప్లేస్‌ని వేరే వాళ్లతో రీప్లేస్ చేయడం పక్కా..!
తాజాగా ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక పై ఈ సీరియల్ మధ్యాహ్నం ప్రసారమవ్వనుంది. రిషి అదే సీరియల్లో కొనసాగితే సీరియల్ సమయం మార్చే వాళ్లు కాదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్లో ఇక నుంచి హీరో కనిపించడు.. ఇంకో వైపు సీరియల్ రేటింగ్ కూడా పడిపోయింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్ మా సీరియల్ టైమింగ్స్ మార్చింది.