- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలన నిర్ణయం తీసుకున్న గుప్పెడంత మనసు రిషి.. వాటికి పూర్తిగా గుడ్ బై..?
దిశ, సినిమా: స్టార్ మా లో ఒకప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు రేటింగ్ మొత్తం తగ్గిపోయింది. ఎప్పుడైతే రిషి ( ముఖేష్ గౌడ ) సీరియల్ నుంచి వెళ్లిపోయాడో.. అప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు సీరియల్ చూడటమే మానేశారు. దీంతో రేటింగ్ ఘోరంగా పడిపోయింది. మళ్లీ గాడిలో పెట్టడానికి అనుపమ-మనుల మధ్య మదర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ చేస్తున్నారు కానీ కనెక్షన్ కుదరడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతుంది. తాజాగా ఈ సీరియల్ హీరో రిషి కి సంబందించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
నెమ్మదిగా రిషి రీ ఎంట్రీకి దారులన్ని మూసుపోతున్నాయి. ఎందుకంటే.. ముఖేష్ గౌడ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. ఆ సినిమా షూటింగ్ డేట్స్.. సీరియల్స్ డేట్స్ అడ్జెస్ట్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. డేట్ అడ్జెస్ట్ విషయంలోనే ముఖేష్ గౌడకి.. ఈ సీరియల్ యూనిట్‌కి గొడవలు వచ్చాయనే టాక్ బాగా వినిపిస్తుంది. ఇక ముఖేష్ గౌడ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. సీరియల్ ఎక్కడ పడిపోతుందేమో అని కొత్త హీరోని తీసుకొచ్చారు.
సీరియల్స్ లో నటించే నటులు నుంచి సినిమాలవైపు వెళ్లాలని అనుకుంటారు కానీ.. సినిమా చేసి.. మళ్లీ సీరియల్ వైపు రావాలని ఎవరూ అనుకోరు. ఈ క్రమంలోనే రిషి ( ముఖేష్ గౌడ ) సీరియల్స్ కి పూర్తిగా గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకోనున్నారని తెలిసిన సమాచారం. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాల్లోనే కొనసాగుతారని, సీరియల్స్ వైపు ఇక రారని సన్నిహితులు కూడా చెబుతున్నారు.