15కిలోల బంగారం.. 14 రకాల ఆభరణాలు: సమంత కోసమేనట

by sudharani |   ( Updated:2023-03-23 13:40:27.0  )
15కిలోల బంగారం.. 14 రకాల ఆభరణాలు: సమంత కోసమేనట
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన సినిమాల్లో వాడే ఆభరణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సమంత లుక్‌కు సంబధించిన కొత్త ఫొటోను తాజాగా రిలీజ్ చేస్తూ ఈ సినిమాలో వాడిన గోల్డ్ నక్లెస్‌ల గురించి మాట్లాడాడు.

‘‘దాన వీర శూర కర్ణ’ స్ఫూర్తితోనే నా సినిమాల్లో నిజమైన ఆభరణాలే వాడుతున్నా. ఆ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళుతున్నా. ‘శాకుంతలం’లో ప్రధాన పాత్రధారులకోసం రూ.14 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రభరణాలు వాడినం. ఇందుకోసం మొత్తంగా 15 కిలోల బంగారం వినియోగించాం. వసుంధర జ్యువెలర్స్ వారు 7 నెలలు కష్టపడి వీటిని తీర్చిదిద్దారు. కేవలం సమంత కోసమే 14 రకాల ఆభరణాలు తయారు చేయించాం. అయితే పూర్తిగా చేతితోనే చేసిన ఈ ఆభరణాలు చిత్రంలోని ప్రతి పాత్రకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read...

ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి.. కంగనా పోస్ట్ వైరల్

Advertisement

Next Story