గ్రంథాలయం.. ట్రైలర్ లాంచ్ చేసిన సినీ ప్రముఖులు

by Mahesh |   ( Updated:2023-12-13 11:59:48.0  )
గ్రంథాలయం.. ట్రైలర్ లాంచ్ చేసిన సినీ ప్రముఖులు
X

దిశ, సినిమా : కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం" ట్రైలర్ లాంచ్ చేశారు లెజెండరీ దర్శకులు బి. గోపాల్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్. వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి కీలక పాత్రల్లో కనిపించనున్న సినిమాకు సాయిశివన్‌ జంపాన దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా మార్చి 3న రిలీజ్ కానున్నట్లు తెలిపిన మేకర్స్.. కచ్చితంగా సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందన్నారు. ఇక తనకు వచ్చిన కలను సినిమా కథగా మార్చానని తెలిపిన డైరెక్టర్.. ఒక సస్పెన్స్ కాన్సెప్ట్‌ను కమర్షియల్ యాక్షన్ మూవీగా తీసుకురావడం ప్రయోగంగా భావిస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story