ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

by M.Rajitha |   ( Updated:2024-10-08 15:02:00.0  )
ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (70th National Film Awards) ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు పురస్కారాలు అందుకున్నారు. 2022వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి(కాంతార), ఉత్తమ నటిగా నిత్యమీనన్(తిరుచిత్రంబలం), మానసి పరేఖ్(కచ్ ఎక్స్ప్రెస్) అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ సంగీత దర్శకునిగా ఏఆర్ రహమాన్ 'పొన్నియన్ సెల్వన్' చిత్రానికి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'(మలయాళం) ఎన్నికవగా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు నుంచి 'కార్తికేయ-2' ఎన్నికవగా.. ఈ చిత్ర దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు అందుకున్నారు.

Advertisement

Next Story