Pushpa 2-The Rule Glimpses will be seen along with the film 'Avatar 2'

by Vinod kumar |   ( Updated:2022-12-04 12:34:10.0  )
Pushpa 2-The Rule Glimpses will be seen along with the film Avatar 2
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. 2021 డిసెంబర్ 17న విడుదలై గొప్ప ఆదరణ పొందింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రం నుంచి రోజుకో క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మరో న్యూస్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే గ్లింప్స్‌ను సర్‌ప్రైజ్‌గా ఇచ్చేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అవతార్-2' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా థియేటర్‌లో 'పుష్ప-2' గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నారటా. 'అవతార్-2' సినిమా గ్లోబల్ ఆడియన్స్ చూసే సినిమా కావడంతో 'పుష్ప-2' కూడా వారికి రీచ్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story