'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదల అప్పుడేనా..?

by Shiva |
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదల అప్పుడేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ యాంగ్రీ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం, గబ్బర్ సింగ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా మే 11, 2023న ఈ సినిమా మొదటి వీడియో గ్లింప్స్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.

Advertisement

Next Story