- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ అండ్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న 'బుట్ట బొమ్మ' ట్రైలర్!
దిశ, సినిమా: శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్‌గా రూపొందించిన చిత్రం 'బుట్టబొమ్మ'. ఇందులో అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నటించారు. ఫిబ్రవరి 4న విడుదలకానుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విశ్వక్‌సేన్ విడుదల చేశారు. తెలియని వ్యక్తి అనికా సురేంద్రన్‌కి ఫోన్ చేసి ఆమె పేరు అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆటో డ్రైవర్‌గా ఉండే ఈ వ్యక్తితో మాట్లాడేందుకు ఆమె మొదట సంకోచించినప్పటికి తర్వాత ఫోన్ ద్వారా వారిమధ్య ఒక అందమైన సంబంధం ఏర్పడుతుంది. అనికా కుటుంబం చాలా కఠినమైన తండ్రి చేతులమీదుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వారి జీవితంలోకి విలన్‌గా అర్జున్ దాస్ ఎంట్రీ ఇస్తాడు. మొత్తనికి జీవితంలో స్వేచ్ఛను కోరుకునే పల్లెటూరి అమ్మాయిగా అనికా అద్భుతంగా నటించింది. ట్రైలర్‌లో ఆమె ముద్దుగా, అందంగా కనిపించింది. సూర్య, అర్జున్‌దాస్ తమ తమ పాత్రలకు ప్రాణం పోసి నటించినట్లుగా అనిపించింది.