'గేమ్ ఆన్'.. ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది: టీజ‌ర్ రిలీజ్‌లో విశ్వక్ సేన్‌

by Vinod kumar |   ( Updated:2023-02-22 12:56:24.0  )
గేమ్ ఆన్.. ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది: టీజ‌ర్ రిలీజ్‌లో విశ్వక్ సేన్‌
X

దిశ, సినిమా: గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్‌'. ఏ క‌స్తూరి క్రియేష‌న్స్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన సినిమాకు ద‌యానంద్ ద‌ర్శక‌త్వం వహించాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా టీజర్‌ను విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్.. 'కొత్త వాళ్లను ఎంక‌రేజ్ చేయ‌టంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఢిపరెంట్ స్టోరీతో వస్తున్న చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. అందరికీ అల్ ది బెస్ట్' అని చెప్పాడు.

అలాగే 'సినిమాను ఓ పాపలాగా కేర్ తీసుకుని చేశాం. మీ అందరికీ విజువ‌ల్స్ న‌చ్చాయ‌ని భావిస్తున్నాం. మూవీ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మకం ఉంది. ఆదిత్య మీన‌న్‌, విశ్వక్‌కి స్పెష‌ల్ థాంక్స్' అని తెలిపారు దర్శకనిర్మాతలు. హీరో గీతానంద్‌, న‌టుడు ఆదిత్య మీన‌న్‌, ద‌ర్శకుడు ద‌యానంద్‌, నిర్మాత ర‌వి క‌స్తూరి, మ్యూజిక్ డైరెక్టర్ న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్-అరుణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ అర‌వింద్ విశ్వనాథ‌న్ త‌దిత‌రులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement

Next Story