Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ .. థియేటర్స్ లో స్టెప్పులేస్తూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2024-09-05 12:56:59.0  )
Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ .. థియేటర్స్ లో స్టెప్పులేస్తూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు.. రెండు, మూడు రోజుల నుంచే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు.. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కొత్త మూవీ అప్డేట్స్ కూడా రావడం కష్టమవుతుంది. రీసెంట్ గా పవన్ ఫ్యాన్స్ ఒక్కటంటే ఒక్క పోస్టర్ అయినా విడుదల చేయండి సామీ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేసారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల పవన్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా 12 ఏళ్ళ తర్వాత ఆయన కెరీర్లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ అయి థియేటర్లలో సందడీ చేస్తుంది.

దీంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అందరి హీరోల్లాగా ఏడాదికి ఒక సినిమా పవన్ నుంచి రావడం లేదు.. అయినా క్రేజ్ కొంచం కూడా తగ్గలేదు. ఏళ్ళు గడుస్తున్నా ఇతనికి మాత్రం ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఖుషీ మూవీ తర్వాత అంత పెద్ద హిట్ గబ్బర్ సింగ్ తో పడింది. 2012 లో ఈ మూవీ రిలీజ్ ఐనప్పుడు ఎలాంటి హంగామా ఇప్పుడు దానికి మించిన సందడీ చేస్తున్నారు.

ముఖ్యంగా, ఈ ,మూవీలో ప్రతి ఒక్క డైలాగ్ పేలింది .. ఇప్పటికి చాలా మంది నాకు కొంచం తిక్క ఉంది.. కానీ దానికో లెక్క ఉందంటూ సరదగా కూడా వాడుతూనే ఉంటారు. అలాగే మందు బాబులం మేము మందు బాబులం అనే పాట కూడా సోషల్ మీడియా రీల్స్ లో వస్తూనే ఉంటుంది. అతని మ్యానరిజమ్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేసాయి. ఈరోజు రీ రిలీజ్ అవ్వడంతో పాటలకు స్టెప్పులేస్తూ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed