Vennela Kishore హీరోగా ‘చారి 111’ సినిమా.. ఫన్నీ వీడియో రిలీజ్

by Prasanna |   ( Updated:2023-08-25 04:58:05.0  )
Vennela Kishore హీరోగా ‘చారి 111’ సినిమా..  ఫన్నీ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ కమెడియన్లలో ముందు వరుసలో ఉన్న వెన్నెల కిశోర్ తాజాగా ‘చారి 111’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్పై యాక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మురళీ శర్మ, సంయుక్త విశ్వనాథన్, ప్రియామాలిక్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రశాంతంగా ఉన్న సిటీలో ఓ ప్రమాదం వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి దొరికింది మాత్రం ‘లక్ ఉండి టాలెంట్ లేని.. స్టైల్ ఉండి స్టఫ్ లేని ఒక ట్యూబ్ లైట్ గాడు’ అనే డైలాగ్‌తో వెన్నెల కిశోర్ పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. మొత్తానికి ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‍గా ఉందని అంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : ‘Slum Dog Husband’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story