Manchu Vishnu:‘మా’ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్..

by Hamsa |
Manchu Vishnu:‘మా’  సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్..
X

దిశ, సినిమా: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ హెల్త్ చెకప్‌లో ‘మా’ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘డా.శాస్త్రి, జీవీకే హెల్త్ హబ్‌కు థాంక్స్. ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ హెల్త్ చెకప్‌ను ఫ్రీగా అందిస్తున్నందుకు థాంక్స్. ఇది ఇకపై ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆ తర్వాత మాదాల రవి మాట్లాడుతూ.. ‘జీవీకే హెల్త్ హబ్‌తో కలిసి మాస్టర్ హెల్త్ చెకప్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు మా సభ్యుల ఆరోగ్యానికి ఎప్పడూ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది మా ఆధ్వర్యంలో నాలుగో హెల్త్ క్యాంపు. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం హెల్త్ కార్డ్‌లను జారీ చేశాం. వాటిని అందరూ వినియోగించుకోవాలి. దేశంలో అత్యవసర సేవల విషయంలో జీవీకే సంస్థ చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. మా సభ్యుల కోసం ఇలా హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు సాయం చేసిన జీవీకే రెడ్డి గారికి థాంక్స్’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed