నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. ‘మాయే చేసి మెల్లగా’ పాట కోసం విదేశీ వాయిద్యాలు

by Anjali |   ( Updated:2023-10-06 08:34:13.0  )
నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. ‘మాయే చేసి మెల్లగా’ పాట కోసం విదేశీ వాయిద్యాలు
X

దిశ, సినిమా : నందమూరి కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘డెవిల్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్క అప్‌డేట్ ఇస్తున్న మేకర్స్.. ఈ మధ్య ‘మాయే చేసి మెల్లగా’ సాంగ్‌ రిలీజ్ చేశారు. 1940లోని మద్రాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సినిమా సాగుతుంది కాబట్టి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.

నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాటలో దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ వంటి రకరకాల వాయిద్యాలను వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు.

Advertisement

Next Story